పనులన్నీ త్వరిగతిన పూర్తి: వెల్లంపల్లి | Minister Vellampalli Srinivas And MLA Malladhi Vishnu Visits Vijayawada | Sakshi
Sakshi News home page

మంత్రి జిల్లా పర్యటన: పలు పనులకు శంకుస్థాపన

Oct 29 2019 12:03 PM | Updated on Oct 29 2019 12:22 PM

Minister Vellampalli Srinivas And MLA Malladhi Vishnu Visits Vijayawada  - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలోని భవానిపురంలో ఈ నెల 26, 27, 28 తేదిల్లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సీటిలోని రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement