ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన మంత్రి పేర్నినాని | Minister Perni Nani Clears Traffic At Prakasam Barrage | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన మంత్రి పేర్నినాని

Aug 17 2019 6:07 PM | Updated on Sep 3 2019 8:50 PM

Minister Perni Nani Clears Traffic At Prakasam Barrage - Sakshi

భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వటంతో ఆయన రోడ్డుపైకి దిగారు. పెద్దసంఖ్యలో పేరుకుపోయిన..

సాక్షి, విజయవాడ : రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను దగ్గరుండి క్లియర్‌ చేశారు. శనివారం ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి రోడ్డుపై పెద్దసంఖ్యలో పేరుకుపోయిన వాహనాలను దగ్గరుండి క్లియర్‌ చేశారు. అంతకు క్రితం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పేర్నినాని వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement