శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ వద్ద రాజధాని వద్దనలేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.
హైదరాబాద్ : శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ వద్ద రాజధాని వద్దనలేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడకు ఉత్తరం వూపు రాజధాని పెట్టుకోమని సూచించిందని ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో మీడియా చిట్ చాట్లో వ్యాఖ్యానించారు.
వ్యవసాయ భూములను వినియోగించవద్దని కమిటీ చెప్పిందని, పూర్తి నివేదికను కమిటీ ఈరోజు కేంద్రానికి అందచేస్తుందన్నారు. నివేదికలన్ని ఇచ్చాక తాము నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు.