2016 నుంచి విధిగా గ్రామీణ సర్వీసు | MBBS Doctors must be worked in rural areas from 2016 | Sakshi
Sakshi News home page

2016 నుంచి విధిగా గ్రామీణ సర్వీసు

Jul 24 2014 2:49 AM | Updated on Sep 2 2017 10:45 AM

ఎంబీబీఎస్ వైద్య విద్య చదివిన డాక్టర్లు విధిగా ఏడాది పాటు గ్రామీణ సర్వీసు చేయాలన్న నిబంధన 2016 నుంచి అమలులోకి రానుంది.

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ వైద్య విద్య చదివిన డాక్టర్లు విధిగా ఏడాది పాటు గ్రామీణ సర్వీసు చేయాలన్న నిబంధన 2016 నుంచి అమలులోకి రానుంది. 2010లో ఎంబీబీఎస్‌లో చేరిన వారికి ఇది వర్తిస్తుంది. 2010లో ఎంబీబీఎస్‌లో చేరిన వారికి 2016లో వైద్య విద్య పూర్తవుతుంది. ప్రస్తుతం కూడా ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ చేసిన వారు గ్రామీణ సర్వీసు చేస్తున్నారు.


అయితే ఈ మూడు కోర్సుల్లో భాగంగా ఎప్పుడో ఒకసారి గ్రామీణ సర్వీసు చేయడానికి వీలుంది. 2016 నుంచి మాత్రం ఎంబీబీఎస్ పూర్తవగానే కచ్చితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాలి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు జారీ చేసింది. గ్రామీణ సేవల్లో చేరని వారికి భారతీయ వైద్య మండలి(ఏపీ చాప్టర్)లో వైద్యుడిగా రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. కొత్త నిబంధన అమలు వల్ల ఎంబీబీఎస్ చేసిన వారు పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు అనంతరం మళ్లీ గ్రామీణ సేవలు చేయాల్సిన అవసరం ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement