ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం | Unemployment rises to six-month high of 5. 2 Percent in April | Sakshi
Sakshi News home page

ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం

May 20 2026 3:53 AM | Updated on May 20 2026 7:43 AM

Unemployment rises to six-month high of 5. 2 Percent in April

ఏప్రిల్‌లో 5.2 శాతం గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల

న్యూఢిల్లీ: నిరుద్యోగం ఏప్రిల్‌లో స్వల్పంగా పెరిగింది. మార్చిలో ఉన్న 5.1 శాతం నుంచి 5.2 శాతానికి చేరింది. 2025 ఏప్రిల్‌లోనూ 5.1 శాతంగానే ఉండడం గమనార్హం. 15 ఏళ్ల వయసుకు మించి పనిచేసే జనాభాకు సంబంధించి పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాలను కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ శుక్రవారం విడుదల చేసింది. చివరిగా 2025 అక్టోబర్‌లోనూ 5.2 శాతం స్థాయిలో నిరుద్యోగం నమోదైంది.  

పట్టణాల్లో నిరుద్యోగం కాస్తంత దిగొచ్చింది. మార్చిలో ఉన్న 6.8 శాతం నుంచి ఏప్రిల్‌లో 6.6 శాతానికి తగ్గింది.  
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది.  
2025 ఏప్రిల్‌తో పోల్చితే మాత్రం గ్రామీణ, పట్టణ నిరుద్యోగంలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది.  

పట్టణ పురుషుల్లో నిరుద్యోగం మార్చిలో 5 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 5.1 శాతానికి చేరింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది.  
దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు 5.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 4.4 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గగా.. పట్టణ మహిళల్లోనూ 9 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గుముఖం పట్టింది.  
కార్మికుల భాగస్వామ్య రేటు ఏప్రిల్‌లో 55 శాతానికి పరిమితం అయింది. మార్చిలో ఇది 55.4 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement