గ్రామాల్లో మంచినీటికీ మీటర్లే | AP Government Introduces Smart Water Meters, Plans User Charges For Rural Drinking Water | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో మంచినీటికీ మీటర్లే

Jul 7 2026 5:50 AM | Updated on Jul 7 2026 9:30 AM

Chandrababu Govt Conspiracy on Drinking Water Charges

నిర్వహణ నిధుల కోసం యూజర్‌ చార్జీల బాదుడు

 సాక్షి, అమరావతి: విద్యుత్తు వాడకానికి స్మార్ట్‌ మీటర్లను అనుమతించేది లేదని ఎన్నికల ముందు గంభీరంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పు­డు తాగునీటికి సైతం స్మార్ట్‌ మీటర్లు బిగిస్తున్నారు. గ్రామీణ ప్రాంత తాగునీటి వ్యవస్థలోనూ నీటి పరిమా­ణాన్ని నిర్ధారించే మీటర్ల ఏర్పాటుతో పాటు మంచినీటి పథకాల నిర్వహణకు నిధుల సమకూ­ర్చుకునేందుకు యూజర్‌ చార్జీల వసూ­లుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమ­వా­రం జీవో జారీ చేసింది.  ఈ జీవోలో ప్రభుత్వ నిర్ణ­యాలు, వాటి అమల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, అధికా­రుల బాధ్యతలను ని­రా­్ధరించారు. 

గ్రామా­ల్లో ఇళ్లకు తాగు­నీరు సరఫరా చేసే ప్రతి డెలివరీ పైపుపై తప్పని­సరిగా కాలి­బ్రేటెడ్‌ ఫ్లో (సరఫరా చేసే నీటి పరిమాణం కొలిచే) మీటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొ­న్నారు. ఇక ఈ మీటర్ల ద్వారా ఎంత పరిమాణంలో నీటిని వినియోగించారన్నది కూడా ఖచ్చితంగా కొలవా­లని మరోచోట నిర్దేశించారు.

 ఆర్‌డబ్ల్యూ­ఎస్‌ ఏఈ ఆధ్వర్యంలో నీటి పరిమాణ నిర్ధారణ మీటర్లను ఏర్పాటు చేయా­లని.. పంపు ఆపరేటర్లు ప్రతి నెలా 1, 15వ­తేదీలలో ఆయా మీటర్లలో వివ­రాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. గ్రామా­ల్లో తాగునీటి బోర్ల చుట్టూ 15 మీటర్ల పరిధిని ‘నో–యాక్టివిటీ జోన్‌’గా ప్రకటించి బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం, చెత్త వేయడం పూర్తిగా నిషేధించాలని సూచించారు. బోర్లకు 50 మీటర్ల పరిధిలో సెప్టిక్‌ ట్యాంకులు లేదా మురుగునీటి గుంతలు ఉండకుండా చూడాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement