కేసీఆర్పై నేరుగా ఫిర్యాదు చేయలేదు.. | Mattaiah did not complaint directly to the complaint against KCR, says ci satyanarayana | Sakshi
Sakshi News home page

కేసీఆర్పై నేరుగా ఫిర్యాదు చేయలేదు..

Jun 17 2015 11:38 AM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్పై నేరుగా ఫిర్యాదు చేయలేదు.. - Sakshi

కేసీఆర్పై నేరుగా ఫిర్యాదు చేయలేదు..

ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడుగా ఉన్న మత్తయ్య నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫిర్యాదు చేయలేదని సత్యనారాయణపురం సీఐ సత్యనారాయణ తెలిపారు.

విజయవాడ : ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడుగా ఉన్న మత్తయ్య నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫిర్యాదు చేయలేదని సత్యనారాయణపురం సీఐ సత్యనారాయణ తెలిపారు.  కేసీఆర్ తాలూకు మనుషులు తనను బెదిరిస్తున్నారంటూ మత్తయ్య ఫిర్యాదు చేసినట్లు ఆయన బుధవారమిక్కడ చెప్పారు.

 

సీఎం కేసీఆర్, ఏసీబీ అధికారుల పేర్లను మత్తయ్య నేరుగా ప్రస్తావించలేదని, గుర్తు తెలియని వ్యక్తులు తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్లు సీఐ వెల్లడించారు. దీనిపై 506, 507, 185 (A), 387 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఇంతకు మించి వివరాలు వెల్లడించలేమని ఆయన అన్నారు. ఈ కేసును సీబీఐసీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ  చెప్పారు. తనకు ప్రాణహాని ఉందంటూ మత్తయ్య సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement