breaking news
mattaiah
-
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
-
ఈసారి తప్పించుకోలేవ్ బాబు.. ఓటుకు నోటు కేసులో సుప్రీంకు మత్తయ్య లేఖ
-
అంతా చంద్రబాబే చేశాడు.. ఓటుకు నోటు కేసులో సంచలన విషయాలు
-
చేసిందంతా చంద్రబాబే
సాక్షి, న్యూఢిల్లీ: ‘అంతా ఏపీ సీఎం చంద్రబాబే చేశారు.. ఓటుకు కోట్లు కేసులో అతనూ కీలక నిందితుడే. నన్ను స్టీఫెన్సన్ వద్దకు పంపడంలో రేవంత్‌తోపాటు ఆయనదీ కీలకపాత్ర. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పారీ్టకి ఓటేసేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలని బలవంతం చేశారు. రూ. 5 కోట్లు ఆశ చూపాలని చెప్పా రు. కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకకుండా నన్ను లోకేశ్ విజయవాడ తరలించారు. అత ని సన్నిహితుల సహకారంతో ఆరేడు నెలలు నిర్బంధించారు. ఈ కేసులో బాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావు సహా మరికొందరిని నిందితులుగా చేర్చి.. విచారణ చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కి నిందితుడు మత్తయ్య లేఖ రాశారు. చంద్రబాబు, లోకేశ్.. ఈ కేసులో చేసిన దారుణాలను వివరించారు. మంగళవారం ఆ లేఖను ఢిల్లీలోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ (ఇన్వార్డ్)కు అందజేశారు. సుప్రీంకోర్టు లేదా మరేదైనా హైకోర్టులో కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 17 అంశాలతో రాసిన లేఖలో ఆయన పేర్కొన్న వివరాల మేరకు.. చంద్రబాబు, రేవంత్లే పంపారు.. ‘ఓటుకు కోట్లు వ్యవహారంలోకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్లే నన్ను పంపారు. తీర్పును ప్రకటించే ముందు మరో సారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలని కోరుతున్నా. కేసులో నా ప్రమేయంతోపాటు నేరానికి ప్రోత్సహించిన చంద్రబాబు, అతని కుమారుడు, మంత్రి లోకేశ్ ను కూడా నిందితులుగా చేర్చాలి. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, పోలీసు అధికారులు, జడ్జీలు, న్యాయవాదులు, వారికి సహక రించిన ప్రతి ఒక్కరినీ నాతోపాటు సమగ్రంగా విచారించాలి. ఏసీబీ పోలీసుల దర్యాప్తులో అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు మాట్లాడిన రికార్డు.. దీని ఫోరెన్సిక్ నివేదిక, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రూ. 50 లక్షల నగదుపై దర్యాప్తు జరగాలి. చంద్రబాబు, రేవంత్ ప్రోద్బలంతోనే సెబాస్టియన్‌ను ఒప్పించా. 2016లో జరిగిన మహానాడులో చంద్రబాబు, రేవంత్‌లు నన్ను పిలిపించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. టీడీపీ అభ్యరి్థకి ఓటు వేసేలా రూ. 5 కోట్లకు నాటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. ఈ వ్యవహారంలో నన్ను ప్రోత్సహించి, నాతో నేరం చేయించిన చంద్రబాబు, రేవంత్‌తోపాటు భాగ స్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయండి’ అని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ను సీఎంగా తప్పించండి.. ‘ఈ కేసు విచారణ సజావుగా సాగి, నిజానిజాలు బయటకు రావాలంటే రేవంత్‌ను ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలి. నాతో సహా, నిందితులందరినీ విచారించేలా మళ్లీ విచారణకు ఆదేశించాలి. రేవంత్, వేం నరేందర్‌రెడ్డి, వేం కీర్తన్, ఉదయ్‌సింహా తదితరులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నారు. వారు ఏసీబీ అధికారులను ప్రభావితం చేసే అవకాశమే ఎక్కువ. కేసులో వారి పాత్ర లేకుండా చేసేలా ఒత్తిడి తెస్తారు. దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, తప్పుదోవ పట్టకుండా, ఏసీబీ అధికారులను ప్రభావితం చేయకుండా ఉండాలంటే.. ముందుగా వారిని పదవుల నుంచి తప్పించాలి. విచారణ ముగిసేదాకా పదవులకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలి. అంతేకాదు, ఈ కేసు సుప్రీంకోర్టు లేదా ఏపీ, తెలంగాణేతర హైకోర్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాలి’ అని మత్తయ్య కోరారు. లోకేశ్, అతని సన్నిహితులే నిర్బంధించారు ఈ కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులకు నన్ను దొరకకుండా చేసేందుకు ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేశ్ విశ్వప్రయత్నం చేశారు. ఆయన సన్నిహితులు కిలారి రాజేశ్, రేవంత్ అనుచరుడు జిమ్మీ బాబు, మరికొందరు కారులో నిర్బంధించారు. బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఆ సమయంలో కాళ్లూ, చేతులూ కట్టేయడంతోపాటు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు. నా భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా.. నా కుటుంబానికి దూరం చేశారు. ఏపీలోని పలు ప్రదేశాల్లో చీకటి గదిలో బంధించి, అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు, లోకేశ్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. నేను ఎక్కడికీ వెళ్లకుండా కాపలాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాటి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అప్పటి డీజీపీ, టాస్‌్కఫోర్స్ బృందాలు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారు. వారందర్నీ నిందితులుగా చేర్చి, విచారించాలి. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ కేసులో నాతో బలవంతంగా ఫిర్యాదు చేయించారు. 164 స్టేట్మెంట్పై బలవంతంగా సంతకం పెట్టించారు. వందకు పైగా తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించున్నారు. నా భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, అమరావతిలో ఇల్లు, వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని, పిల్లల చదువు, భవిష్యత్‌కు సహకరిస్తామని నమ్మించారు. అలా 164 స్టేట్మెంట్పై సంతకం చేయించారు. టీడీపీ న్యాయవాదులు కనకమెడల, దమ్మలపాటి, మరికొందరు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వారికి సహకరించారు. లోకేశ్ టీం, టీడీ జనార్ధన్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్, కేబినెట్ మంత్రులు, అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చి పూర్తిగా విచారణ చేయాలి. నేను ఈ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో ‘‘పార్టీ ఇన్ పర్సన్’’గా పిటిషన్ వేశా. ఒక బాధ్యతగల పౌరుడిగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓటుకు కోట్లు కేసు నిందితుడిగా ఉన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపపడుతున్నా. తప్పు తెలుసుకొని నిజాలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నా. నన్ను అప్రూవర్‌గా అనుమతించండి’ అంటూ మత్తయ్య సీజేఐని అభ్యరి్థంచారు. -
ఓటుకు కోట్లు : మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
-
ఓటుకు కోట్లు : మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లు తనను బలిపశువు చేస్తున్నాయని కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు స్టీఫెన్‌సన్‌తో పాటు చాలా మందిని కొనుగోలు చేసి ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరికి టీడీపీ నాయకులు ఫోన్ చేశారన్న విషయాన్ని బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులను ప్రలోభపెట్టి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ప్రమేయమున్న అందరిపై పూర్తి దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఎవరెవరిని కోనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయాలను సైతం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసును పునఃసమీక్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరారు. -
హైకోర్టును ఆశ్రయించిన మత్తయ్య
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తనకు అధికారులు నోటీసులు ఇచ్చారని పిటిషన్లో తెలిపాడు. కేసు వివరాలు తెలియకుండా రెండు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని పేర్కొన్నాడు. తనకు న్యాయవాదిని నియమించాలని మత్తయ్య హైకోర్టును కోరాడు. -
హైకోర్టులో మత్తయ్య క్వాష్ పిటిషన్
-
మత్తయ్య బాటలోనే జిమ్మిబాబు!
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న మత్తయ్య బాటలోనే తాజాగా జిమ్మిబాబు కూడా పయనిస్తున్నట్లు సమాచారం. తనపై మోపిన అభియోగాలను కొట్టివేయాలంటూ జిమ్మిబాబు ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ నోటీసులు అందుకున్న జిమ్మిబాబు ఈరోజు సాయంత్రం అయిదు గంటల్లోగా ఏసీబంఈ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో జిమ్మిబాబుకు ఉన్న సాన్నిహిత్యంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరగుతోంది. జిమ్మిబాబు విచారణతో కేసులో కీలక ఆధారాలు సేకరించవచ్చని ఏసీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జిమ్మిబాబు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దగ్గరకు సెబాస్టియన్‌ను తీసుకు వెళ్లటంలో జిమ్మిబాబు కీలక పాత్ర పోషించారు. ఇక మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. -
కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి
-
తప్పుకోను.. నేనే విచారిస్తా
'మత్తయ్య పిటిషన్' విచారణ నుంచి తప్పుకోవాలని కోరడంపై జస్టిస్ శివశంకరరావు ఎవరో ఏదో చెప్పారని న్యాయమూర్తిపైనే ఆరోపణలా? ఆధారాల్లేకుండా విచారణ నుంచి తప్పుకోవాలని అంటారా?.. ఇలాంటివి వ్యవస్థ మనుగడకే ముప్పు స్టీఫెన్సన్ తీరు కోర్టు ధిక్కారమే.. ఆయనపై చర్యలు చేపట్టాలంటూ రిజిస్ట్రీకి ఆదేశం అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి అవసరమైతే మత్తయ్య పిటిషన్‌పై విచారణను వీడియో ద్వారా చిత్రీకరిస్తామని వెల్లడి సీజే నుంచి అనుమతులు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశం... ఆ తర్వాతే విచారణ చేపడతామని స్పష్టం సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు'వ్యవహారంలో తనపై కేసును కొట్టివేయాలంటూ నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను తానే విచారిస్తానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు స్పష్టం చేశారు. ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈ మేరకు స్టీఫెన్సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేకాక స్టీఫెన్‌సన్‌పై కోర్టు ధిక్కారం కింద చర్యలకు ఆదేశించారు. మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ తీరును, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ.. కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ స్టీఫెన్సన్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతవారం వాదనలు విన్న జస్టిస్ శివశంకరరావు సోమవారం ఉదయం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా స్టీఫెన్సన్ తీరుపై జస్టిస్ శివశంకరరావు మండిపడ్డారు. ప్రజాప్రతినిధిననే విషయం మర్చిపోయి, న్యాయమూర్తిపైనే తీవ్ర ఆరోపణలు చేశారని తప్పుపట్టారు. విచారణ జరిగినప్పుడు కోర్టులో లేకుండానే, ఎవరో ఏదో చెప్పారని ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో జరిగింది ఎవరు చెప్పారు, వారితో తనకున్న సంబంధం ఏమిటి? తదితర వివరాలను స్టీఫెన్సన్ ఎక్కడా తన పిటిషన్లో పేర్కొనకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. కోర్టులో ఏదో జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఇలా విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం, న్యాయమూర్తులను తప్పించుకుంటూ వెళ్లడమేనని తీర్పులో పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మొత్తం వ్యవస్థ మనుగడకే ప్రమాదమని వ్యాఖ్యానించారు. పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసేందుకు తగిన కారణాలుండాలని... ఒకవేళ కారణమున్నా కూడా న్యాయమూర్తిని కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరే హక్కు లేదని స్పష్టం చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపకుండా కేసు విచారణ నుంచి తప్పుకోవాలనడం గదమాయింపు తప్ప మరొకటి కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ధిక్కారమే.. కోర్టు హాలులో నుంచి తాను న్యాయవాదులందరినీ వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాన నడంలో ఎటువంటి వాస్తవం లేదని, ఇటువంటి ఆరోపణ కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు తన తీర్పులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్-14 కింద నిర్దేశించిన విధివిధానాలకు, దీనిపై హైకోర్టు రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. చర్యలు చేపట్టే ముందు అవసరమైతే నిబంధనల మేరకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రీకి సూచించారు. కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడమంటే... న్యాయమూర్తిగా తాను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లేనంటూ సుబ్రతారాయ్-సహారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ శివశంకరరావు తీర్పులో ప్రస్తావించారు. విచారణ నుంచి తప్పుకోవాలని అడిగినంత మాత్రాన తప్పుకోవాల్సిన అవసరం లేదని, ఈ కేసులో తదుపరి విచారణను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిష్పక్షపాత విచారణకు ఇరుపక్షాలూ సహకరించాలన్నారు. సీజే అనుమతిస్తే ప్రొసీడింగ్స్ చిత్రీకరణ ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తే ఈ కేసులో పారదర్శకత కోసం కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలని నిర్ణయించామని జస్టిస్ శివశంకరరావు తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో ఆన్ రికార్డ్ ఉన్న న్యాయవాదులు, కేసుతో సంబంధమున్న సీనియర్ న్యాయవాదులు, అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తప్ప ఇతరులకు ప్రవేశం ఉండబోదని స్పష్టం చేశారు. హైకోర్టులో మొదటిసారిగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ, ఇది కొత్తేమీ కాదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి నుంచి తగిన అనుమతులు తీసుకుని.. ఆడియో, వీడియో రికార్డింగ్ కోసం తగిన ఏర్పాటు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ తరువాతే మత్తయ్య పిటిషన్‌ను విచారణకు వేయాలని స్పష్టం చేశారు. -
స్టీఫెన్సన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
-
స్టీఫెన్సన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
హైదరాబాద్ : నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించింది. సెక్షన్-14 ప్రకారం స్టీఫెన్‌సన్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. కోర్టు ధిక్కార అభియోగం కింద ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా తనపై ఉన్న కేసులను కొట్టి వేయాలంటూ ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వేసిన పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలని స్టీఫెన్సన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మత్తయ్య క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు
-
మత్తయ్య క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య క్వాష్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదన ప్రారంభమైంది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధం లేదని, అందువల్ల తన పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించేలా చూడాలంటూ మత్తయ్య పిటిషన్ దాఖలు చేసుకున్నారు. గత నెల 28న స్టీఫెన్సన్ ఫిర్యాదు చేస్తే 31న ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దీని వెనుక దురుద్దేశాలున్నాయని మత్తయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దాంతో ఈ నెల 24 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే. -
నిందితులకు ఏపీ సర్కార్ అండ
* కేంద్ర హోంశాఖకు, గవర్నర్‌కు ఏసీబీ ఫిర్యాదు * ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్యకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు * ఇక్కడ ప్రధాన నిందితుడని తెలిసీ సహకరించారు * నోటీసు అందుకున్న సండ్రకు ఆశ్రయమిచ్చారు * చట్టాన్ని అపహాస్యం చేసేలా ఏపీ ప్రభుత్వ చర్యలుఉన్నాయని ఆందోళన... పలు ఆధారాలతో సహా నివేదిక * న్యాయ నిపుణులతో సంప్రదింపులు * కోర్టును ఆశ్రయించే యోచన సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో సహ నిందితుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్న వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి ఏసీబీ తీసుకెళ్లింది. తీవ్రమైన ఈ అవినీతి కేసులో నిందితుడు మత్తయ్య విజయవాడ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా ఓ నివేదికను కేంద్ర హోంశాఖకు ఏసీబీ అధికారులు సమర్పించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలంటూ రూ.5కోట్లతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్యను నాలుగో నిందితుడిగా పేర్కొంటూ గత నెల 31న ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా... అతను హైకోర్టును ఆశ్రయించేదాకా కూడా విజయవాడలో, అక్కడి పోలీసుల సంరక్షణలోనే ఉన్నాడని కేంద్ర హోంశాఖకు అందజేసిన నివేదికలో ఏసీబీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ‘‘అతి ముఖ్యమైన అవినీతి కేసును మేం విచారిస్తున్నాం. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి విచారించాం. తదుపరి వివరాల కోసం మత్తయ్యను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగానే విజయవాడకు పారిపోయాడు. తనను బెదిరిస్తున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పొరుగు రాష్ట్రంలో ఓ ముఖ్యమైన కేసులో నిందితుడు.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తప్పుడు ఫిర్యాదు ఇచ్చినా ఊరుకున్నారు. నిందితుడు కళ్ల ముందే తిరుగుతున్నా పట్టించాలన్న ఆలోచన చేయలేదు. పైగా నిందితుడు ఇచ్చిన ఫిర్యాదును అక్కడి సీఐడీ విభాగానికి ఇచ్చి విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. చట్టాన్ని అపహాస్యం పాలు చేస్తున్న చర్యగా కనిపిస్తోంది..’’ అని నివేదికలో ఏసీబీ పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే కేసులో పూర్వాపరాలు తెలిసిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను విచారించేందుకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు జారీచేసిన సంగతిని నివేదికలో ప్రస్తావించింది. ‘బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే మా నోటీసుకు స్పందించి విచారణకు వచ్చి తనకు తెలిసిన విషయాలను వివరిస్తారని ఆశించాం. దురదృష్టవశాత్తు ఆ ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఫోటోతో సహా ప్రచురించింది. టీడీపీకి చెందిన ఓ నేత అతిథి గృహంలో ఈ ఎమ్మెల్యే తలదాచుకుంటున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం, అక్కడి పోలీసులు చట్టంతో తమకు పనేమిటన్న రీతిలో ప్రవర్తించడం ఆందోళన కలిగించే పరిణామం..’’ అని పేర్కొన్నట్లు తెలిసింది. షెల్టర్‌జోన్‌గా.. ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో భాగమేనని.. కానీ అక్కడి ప్రభుత్వం విచక్షణ మరచిందని ఏసీబీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణలో నేరం చేసిన వారికి ఆంధ్రప్రదేశ్ షెల్టర్ జోన్‌గా మారిందని పేర్కొంటున్నాయి. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని... అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ ఇటీవల గవర్నర్ నరసింహన్‌ను కలసి ఏపీ ప్రభుత్వ తీరును వివరించారు. ఏసీబీ డీజీ ఖాన్, డీజీపీ అనురాగ్‌శర్మ కూడా జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు పూసగుచ్చినట్లు వివరించారు. కేసు ముందుకు సాగకుండా ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డు పడుతోందని, నిందితుడు మత్తయ్య, సాక్షి సండ్ర వెంకటవీరయ్యలకు షెల్టర్ జోన్‌గా మారిందని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసు పురోగతిపై వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. -
'మత్తయ్య నిందితుడని తెలియదు'
-
'మత్తయ్య నిందితుడని తెలియదు'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోట్ల కేసులో మత్తయ్య అనే వ్యక్తి కూడా నిందితుడు అన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అందుకే మత్తయ్య నేరుగా విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేసినా అతడిని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మత్తయ్య తమ ఆధీనంలో లేడని కూడా ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. మత్తయ్య నిందితుడైనా అతడు మీడియాతో మాట్లాడుతున్నా తన నివాసాన్ని ఎప్పటికప్పుడు మార్చడంతో అతడి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నామని ఓ దశలో పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ మత్తయ్య విజయవాడ వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఇంత జరిగినా.. మత్తయ్య నిందితుడన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ సీపీ చెప్పడం గమనార్హం. -
మత్తయ్యను అదుపులోకి తీసుకున్న సీఐడీ
-
మత్తయ్యను అదుపులోకి తీసుకున్న సీఐడీ
విజయవాడ: ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్యను ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ మత్తయ్య చేసిన ఫిర్యాదుపై సీఐడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అతడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు ఇవాళ స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దాంతో మత్తయ్య వాంగ్యూలాన్ని మేజిస్ట్రేట్ రికార్డు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాలూకు మనుషులు తనను బెదిరిస్తున్నారంటూ మత్తయ్య కొద్దిరోజుల క్రితం విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
కేసీఆర్‌పై నేరుగా ఫిర్యాదు చేయలేదు..
-
కేసీఆర్‌పై నేరుగా ఫిర్యాదు చేయలేదు..
విజయవాడ : ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడుగా ఉన్న మత్తయ్య నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫిర్యాదు చేయలేదని సత్యనారాయణపురం సీఐ సత్యనారాయణ తెలిపారు. కేసీఆర్ తాలూకు మనుషులు తనను బెదిరిస్తున్నారంటూ మత్తయ్య ఫిర్యాదు చేసినట్లు ఆయన బుధవారమిక్కడ చెప్పారు. సీఎం కేసీఆర్, ఏసీబీ అధికారుల పేర్లను మత్తయ్య నేరుగా ప్రస్తావించలేదని, గుర్తు తెలియని వ్యక్తులు తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్లు సీఐ వెల్లడించారు. దీనిపై 506, 507, 185 (A), 387 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఇంతకు మించి వివరాలు వెల్లడించలేమని ఆయన అన్నారు. ఈ కేసును సీబీఐసీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. తనకు ప్రాణహాని ఉందంటూ మత్తయ్య సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే.