మత్తయ్య క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు | mattaiah-squash-petition-enquiry-starts-in-highcourt | Sakshi
Sakshi News home page

Jun 25 2015 11:32 AM | Updated on Mar 21 2024 8:58 PM

ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య క్వాష్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదన ప్రారంభమైంది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధం లేదని, అందువల్ల తన పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించేలా చూడాలంటూ మత్తయ్య పిటిషన్ దాఖలు చేసుకున్నారు. గత నెల 28న స్టీఫెన్‌సన్ ఫిర్యాదు చేస్తే 31న ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, దీని వెనుక దురుద్దేశాలున్నాయని మత్తయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో ఈ నెల 24 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement