అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి | Married woman suspicious death | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

Jul 30 2015 3:34 PM | Updated on Sep 3 2017 6:27 AM

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన వైఎస్‌ఆర్‌జిల్లా పోరుమామిళ్ల గిరినగర్ కాలనీలో జరిగింది.

పోరుమామిళ్ల (వైఎస్‌ఆర్‌జిల్లా) : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన వైఎస్‌ఆర్‌జిల్లా పోరుమామిళ్ల గిరినగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పోరుమామిళ్లకు చెందిన జరీనా(30) అనే మహిళ..  భర్త కువైట్‌లో పని చేస్తుండగా, తన ఇద్దరు కొడుకులతో కలిసి గిరినగర్ కాలనీలో ఉంటుంది.

కాగా బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకుంది. గురువారం ఉదయం గమనించిన ఆమె పిల్లలు ఇతర కుటుంబసభ్యులకు చెప్పారు. ఆమె బంధువులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. కువైట్‌లో ఉన్న భర్త ఫోన్‌లో మనస్థాపం చెందే విధంగా మాట్లాడినందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement