మావోయిస్ట్ నేత ఉసెండి లొంగుబాటు | Maoist leader gudsa usendi surrenders in warangal district | Sakshi
Sakshi News home page

మావోయిస్ట్ నేత ఉసెండి లొంగుబాటు

Jan 8 2014 9:49 AM | Updated on Oct 9 2018 2:47 PM

మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి గుమ్మడవెల్లి వెంకటకృష్ణ ప్రసాద్ అలియాస్ గూడ్సా ఉసెండి లొంగిపోయాడు.

వరంగల్ : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి గుమ్మడవెల్లి వెంకటకృష్ణ ప్రసాద్ అలియాస్ గూడ్సా ఉసెండి లొంగిపోయాడు. భార్య రాజీతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) పోలీసులకు నిన్న రాత్రే లొంగిపోయినట్లు సమాచారం.  ప్రస్తుతం ఉసెండి హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అతనిపై రూ.15 లక్షల రివార్డు ఉంది. ఉసెండి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్నాడు.

ఉసెండి స్వగ్రామం వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి. మావోయిస్టు పార్టీలో సుఖ్దేవ్ పేరుతో ఎక్కువగా కొనసాగాడు. రెండేళ్ల క్రితం జరిగిన మావోయిస్టు అగ్రనేత కిషన్జీ ఎన్కౌంటర్ తర్వాత ఉసెండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. కాగా ఉసెండి లొంగుబాటును పోలీసులు నిర్థారించారు.

Advertisement
 
Advertisement
Advertisement