భార్యను హతమార్చిన భర్త | man murdered his wife | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన భర్త

Aug 16 2015 4:26 PM | Updated on Jul 30 2018 9:16 PM

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యపై కత్తితో దాడి చేశాడు.

ముద్దనూరు (వైఎస్సార్‌జిల్లా): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలైన భార్య అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన వైఎస్సార్‌ జిల్లా ముద్దునూరు మండలం పెనికలపాడు గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చెండ్రాయుడు (39), లత (35) లకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇద్దరు గొడవ పడ్డారు. అదే సమయంలో శ్రీనివాసులు తన చేతిలో ఉన్న కత్తితో భార్య తలపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement