రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | man dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Aug 5 2015 7:23 PM | Updated on Aug 30 2018 3:56 PM

విశాఖపట్టణం జిల్లా చోడవరం మండలం నర్సీపేటలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

చోడవరం: విశాఖపట్టణం జిల్లా చోడవరం మండలం నర్సీపేటలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా  గాయపడ్డారు. వివరాలు.. కందెపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (27) మరో వ్యక్తితో కలిసి బుధవారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో బైక్‌పై వెళ్తుండగా నర్సీపేటలోని భీమిలి రోడ్డులో ఎదురుగా మరో బైక్ వచ్చి ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న నాగేశ్వరరావు కిందపడిపోగా అప్పుడే వచ్చిన బస్సు అతని తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement