పిడుగుపాటుతో కూలీ మృతి | Man dies due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో కూలీ మృతి

Jun 5 2015 4:49 PM | Updated on Aug 24 2018 2:36 PM

పిడుగుపాటుకు ఇసుక క్వారీలో పని చేస్తున్న కూలీ మృతి చెందాడు

భట్టిప్రోలు (గుంటూరు జిల్లా) : పిడుగుపాటుకు ఇసుక క్వారీలో పని చేస్తున్న కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలోని ఇసుక క్వారీ వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. ఓలేరు గ్రామానికి చెందిన ఉప్పాల సత్యనారాయణ(45) సమీపంలోని ఇసుక క్వారీలో కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం క్వారీలో పనిచేస్తుండగా అతని సమీపంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రేపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement