మల్లి మస్తాన్ బాబు దుర్మరణం | malli mastan babu dies | Sakshi
Sakshi News home page

మల్లి మస్తాన్ బాబు దుర్మరణం

Apr 4 2015 9:54 AM | Updated on Sep 2 2017 11:51 PM

మల్లి మస్తాన్ బాబు దుర్మరణం

మల్లి మస్తాన్ బాబు దుర్మరణం

పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు కథ విషాదంగా ముగిసింది.

నెల్లూరు : పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు కథ విషాదంగా ముగిసింది. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను  చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద  ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వేలో గుర్తించారు.  మృతుడు మస్తాన్ బాబుది నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగం. కాగా కుమారుడి జాడ తెలియకపోవటంతో మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది.  కొడుకు ఎప్పటికైనా సజీవంగా తిరిగి వస్తాడనుకున్న ఆమె...మస్తాన్ బాబు మరణవార్తతో కుప్పకూలిపోయింది. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement