శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | makara sankranthi bramhosthavams started in sri sailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Jan 13 2014 12:35 AM | Updated on Sep 2 2017 2:34 AM

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీశైలంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఆదివారం ఈఓ చంద్రశేఖర అజాద్ అంకురార్పణ చేశారు

శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైలంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఆదివారం ఈఓ చంద్రశేఖర అజాద్  అంకురార్పణ చేశారు. ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతిపూజ, చండీశ్వరపూజ తదితర విశేష పూజలను ఈఓ దంపతులు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేశారు.
 
 18వ తేదీ వరకు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు స్వామిఅమ్మవార్ల ఆర్జితకల్యాణోత్సవం, రుద్రహోమం, గణపతి, మహామృత్యుంజయ తదితర హోమాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. వారం రోజుల పాటు విశేష వాహనసేవలు, ప్రతిరోజూ గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సంక్రాంతి పర్వదినాన శ్రీ పార్వతీ మల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ అజాద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement