జనసేన పేరుతో పార్టీ ప్రకటించిన పవన్‌కళ్యాణ్ కనీసం ప్రజల్లోకి వెళ్లకుండా వారి సమస్యలు తెలుసుకోకుండా రాజకీయనేతగా అవతారం...
డీసీసీ అధ్యక్షుడు సతీష్‌వర్మ విమర్శలు
సాక్షి, విశాఖపట్నం: జనసేన పేరుతో పార్టీ ప్రకటించిన పవన్‌కళ్యాణ్ కనీసం ప్రజల్లోకి వెళ్లకుండా వారి సమస్యలు తెలుసుకోకుండా రాజకీయనేతగా అవతారం ఎత్తడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్‌వర్మ విమర్శించారు. పవన్‌కళ్యాణ్ కేవలం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దర్శకత్వలో మోడీ నిర్మాతగా నటిస్తున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు.
విశాఖలో జనసేన బహిరంగ సభలో కాంగ్రెస్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలను వర్మ శుక్రవారం ఖండించారు. కాంగ్రెస్‌పై కుట్ర పన్ని టీడీపీకి, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీపెట్టాక ఎవరైనా ప్రజల్లోకి వెళ్లి వారి మధ్య తిరిగి, ప్రజాసమస్యలు తెలుసుకుంటారని... కాని పవన్ మాత్రం మీటింగ్‌లు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు.
సినిమాల్లో నటిస్తున్నట్లుగానే మోడీ వద్ద డబ్బులు తీసుకుని బాబు చెప్పినట్టు నటనలో జీవిస్తున్నారని చెప్పారు. ఈ ఎత్తులను ప్రజలు అర్థం చేసుకుని బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.