ఏపీకి మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం

Maharashtra Special Officers Team To AP - Sakshi

దిశ చట్టంపై సమగ్ర అధ్యయనం

కాసేపట్లో మంత్రులు, అధికారులతో భేటీకానున్న బృందం

సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ' చట్టం గురించి అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక అధికారుల బృందం గురువారం వచ్చింది. దేశవ్యాప్తంగా అందరి మన్నలను పొందుతున్న దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, డీజీపీ సుబోత్‌కుమార్‌ జైశ్వాల్‌, అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీతో పాటు మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బృందం ఏపీకి చేరుకుంది. కాసేపట్లో ఏపీ హోంమంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, సీఎస్‌, డీజీపీ, దిశ స్పెషల్‌ ఆఫీసర్లతో మహారాష్ట్ర బృందం భేటీ కానుంది.

(దేశంలోనే తొలిసారిగా..)

(మహారాష్ట్రలో దిశ చట్టం!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top