దేశంలోనే తొలిసారిగా.. | First Time In The Country That Disha Act Is Going To Be Implemented In AP | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకం

Feb 8 2020 4:54 PM | Updated on Feb 9 2020 3:43 PM

First Time In The Country That Disha Act Is Going To Be Implemented In AP - Sakshi

సాక్షి, విజయవాడ: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శనివారం ‘దిశ చట్టం’పై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మీడియాతో సీపీ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఏపీ లో ‘దిశ’ చట్టం అమలుకాబోతోందని తెలిపారు. సీఎం ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ నూతన ఒరవడికి అద్దం పట్టేలా రూపొందించటం జరిగిందన్నారు. త్వరలోనే విజయవాడలో కూడా ఆధునిక హంగులతో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. దిశ పీఎస్‌లో డీఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు ఎస్‌ఐలతో సహా 47 మంది సిబ్బంది  నిరంతరం అందుబాటులో ఉంటారని సీపీ పేర్కొన్నారు.(ల్యాబ్స్‌ కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement