ఒకే చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య | Lovers commits suicide by hanging from tree in nalgonda district | Sakshi
Sakshi News home page

ఒకే చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

Mar 3 2014 9:40 AM | Updated on Nov 6 2018 7:56 PM

నల్గొండ జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మేళ్లచెరువు శివారులోని ప్రేమికులిద్దరూ ఒకే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నల్గొండ : నల్గొండ జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మేళ్లచెరువు శివారులోని ప్రేమికులిద్దరూ ఒకే చెట్టుకు  ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేళ్లచెరువుకు చెందిన మౌనిక, మునగాల మండలం బాడునాయికి చెందిన వీరస్వామి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు.  వీరస్వామి మేళ్లచెరువులోని కీర్తి సిమెంట్స్‌లో కూలీగా పనిచేస్తున్నాడు.

అదే సిమెంట్‌ కంపెనీ ముందు కూరగాయలు అమ్మే మౌనికతో పరిచయమేర్పడింది. అది ప్రేమ వరకు వెళ్లింది. ఏమైందో ఏమో ఉన్నట్టుండి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కాగా మృతుడు వీరస్వామికి ఇదివరకే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

కాగా నెల్లూరు జిల్లా కావలిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేశారు.  నాగులమ్మ, రవి పురుగుల మందు తాగి ఈ ఘటనకు పాల్పడ్డారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు ముత్తుకూరుకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement