సహజీవనం విషాదాంతం: ప్రియురాలు-ప్రియుడు మృతి | Tragic End to Live in Relationship Lovers Dead | Sakshi
Sakshi News home page

సహజీవనం విషాదాంతం: ప్రియురాలు-ప్రియుడు మృతి

Apr 28 2026 9:52 PM | Updated on Apr 30 2026 6:57 PM

Tragic End to Live in Relationship Lovers Dead

నిజామాబాద్‌: జిల్లాలోని వర్ని మండలం పొట్టిగుట్ట తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ జంట సహజీవనం ఎపిసోడ్‌ విషాదాంతమైంది. తొలుత ప్రియురాలిని పాతో తలపై కొట్టి ప్రియుడు చంపేయగా, అ వ్యక్తిని కవిత కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారు. దాంతో ఇరు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. 

అసలేం జరిగిందంటే..  గత కొంతకాలంగా మేడిపల్లి తండాకు చెందిన ఆనంద్‌తో కవిత సహజీవనం చేస్తోంది. అయితే కొన్ని రోజులుగా ప్రియురాలు కవిత మాట్లాడడం లేదని కిరాతకంగా హత్యచేశాడు ప్రియుడు ఆనంద్.. కొద్ది రోజులుగా ఆనంద్‌ను కవిత దూరం పెట్టింది. 

దాంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఆనంద్‌.. పారతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందింది. అటు తర్వాత ఆనంద్‌ను పట్టుకుని కవిత బంధువులు చితకబాదారు. ఈ దాడిలో ఆనంద్‌ సైతం ప్రాణం కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement