బైక్‌ను ఢీకొట్టిన లారీ ముగ్గురు మృతి | Lorry Road three killed | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ ముగ్గురు మృతి

Mar 4 2015 2:18 AM | Updated on Sep 2 2017 10:14 PM

రోడ్డు పక్కన నిలిపివున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటనలో వుుగ్గురు వుృతి చెందారు.

పిడుగురాళ్లరూరల్ : రోడ్డు పక్కన నిలిపివున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన  ఘటనలో వుుగ్గురు వుృతి చెందారు. పిడుగురాళ్ల పట్టణం పాత బీసీ హాస్టల్ వద్ద వుంగళవారం ఈ సంఘటన జరిగింది.  వివరాలు ఇలా వున్నాయి. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పణితి రాజేష్ (20)అనే యువకుడు తన అక్క కూతురు చంద్రకుంట వసంత(17)తో పాటు బాబారుు వునవడైన కాశివుళ్ల ఆనంద్‌పాల్(4) అనే బాలుడిని తన బైక్‌పై సెంటర్‌కు తీసుకెళ్లాడు.
 
 షాపింగ్ అనంతరం వుున్సిపాలిటీ కార్యాలయుం మీదుగా గాంధీనగర్‌కు వెళ్లే క్రవుంలో ఎదురుగా లారీ ఉండడంతో  రాజేష్ తన బైక్‌ను పక్కన నిలిపివేశాడు. ఈ సమయంలో  వెనుకగా వస్తున్న మరో లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది.  లారీ వెనుక టైరు రాజేష్ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వసంత,ఆనంద్‌పాల్‌కి కూడా తీవ్ర గాయూలయ్యూరుు. క్షతగాత్రులను హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సీఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే దుర్ఘటన జరిగినట్టు గుర్తించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement