టోల్‌గేట్ వద్ద లారీ యజమానుల ఆందోళన | Lorry owners stage dharna at tollgate | Sakshi
Sakshi News home page

టోల్‌గేట్ వద్ద లారీ యజమానుల ఆందోళన

Sep 14 2015 4:08 PM | Updated on Aug 28 2018 4:00 PM

గడువు దాటిపోయినా టోల్‌గేట్ కొనసాగిస్తున్నారంటూ లారీ యజమానులు ఆందోళనకు దిగారు.

తణుకు (పశ్చిమగోదావరి) : గడువు దాటిపోయినా టోల్‌గేట్ కొనసాగిస్తున్నారంటూ లారీ యజమానులు ఆందోళనకు దిగారు. అధిక టోల్‌ ఫీజు వసూలు చేస్తూ తమను నష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

లారీ యజమానులు లారీలను గేట్ వద్ద నిలిపివేసి బైఠాయించారు. వెంటనే టోల్‌గేట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు వచ్చి, ఆందోళనకారులను శాంతింపజేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement