విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన లారీ | Lorry dashes current poles | Sakshi
Sakshi News home page

విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన లారీ

Aug 2 2015 9:12 AM | Updated on Sep 3 2017 6:39 AM

(తెర్లాం): విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఓ లారీ రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది.

విజయనగరం (తెర్లాం):  విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఓ లారీ రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ లారీ స్తంభాన్ని ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా కరెంటు పోయింది.

రాత్రి నుంచి కరెంటు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాగా శనివారం ఉదయం తెర్లాంలోని పెరుమాళ్ల జంక్షన్ వద్ద కామేశ్వరావు అనే ఏడో తరగతి విద్యార్థి ఓ లారీ కింద పడి చనిపోయాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో డ్రైవర్‌ను పరామర్శిద్దామని మరో లారీలో కొంతమంది వెళ్లారు. పరామర్శించడానికి వెళ్లిన లారీ డ్రైవరే కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి మరో యాక్సిడెంట్ చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement