తిరుమలలో లడ్డూల కొరత | laddus scarcity in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో లడ్డూల కొరత

Jun 10 2015 9:29 PM | Updated on Sep 3 2017 3:31 AM

తిరుమలలో శ్రీవారి భక్తులకు బుధవారం లడ్డూల కొరత ఎదురైంది.

తిరుమల: తిరుమలలో శ్రీవారి భక్తులకు బుధవారం లడ్డూల కొరత ఎదురైంది. అదనపు లడ్డూలు అందలేదు. అవసరమైనన్ని లడ్డూలు నిల్వ లేకపోవడంతో కొరత ఏర్పడింది. అందువల్ల బుధవారం ఉదయం 11 గంటలకే అదనపు లడ్డూల కౌంటర్‌ను మూసివేశారు. అదనంగా లడ్డూలు తీసుకెళదామనుకున్న భక్తులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. తిరుమలలో ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్ ఉంది. ఇక్కడ రూ.25 ధరతో రూ.50కి రెండు, రూ.100కి నాలుగు లడ్డూలు చొప్పున టికెట్లు విక్రయిస్తారు. అయితే, ఈ కౌంటర్ నిర్వహించడంలో ఇక్కడి అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. అవసరమైనన్ని లడ్డూలు నిల్వ ఉంచుకోవడంలో విఫలమవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement