breaking news
tirupati laddus
-
శ్రీవారి అదనపు లడ్డూ ధరల పెంపు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూలు అదనం గా కావాలనే భక్తులకు టీటీడీ చేదువార్త అందించిం ది. ఉచిత, సర్వదర్శనం భక్తులకు అందజేసే లడ్డూల ధరల్లో మార్పు చేయని టీటీడీ అదనంగా లడ్డూలు కావాలనే వారికి మాత్రం రెట్టింపు ధరలు చెల్లించి కోరినన్ని లడ్డూలు పొందే సౌకర్యాన్ని కల్పించింది. రూ.25 ధరతో విక్రయించే చిన్న లడ్డూ (175 గ్రాము లు)రూ.50కి, కల్యాణోత్సవం లడ్డూ రూ.100 నుంచి రూ.200, వడప్రసాదం రూ.25 నుంచి రూ.100కి పెంచారు. ఈ ధరలు గురువారం నుంచి అమలు చేశారు. తిరుమల ఆలయం వెలుపల జరిగే కల్యాణో త్సవాల్లో అదనపు లడ్డూలు, వడలు కావాలనే వారికి మాత్రమే ధరలు పెంచుతామని గతంలో టీటీడీ అధి కారులు చెప్పారు. అయితే, శ్రీవారి ఆలయంలో అద నపు లడ్డూలు, వడలు కావాలనే వారికి కూడా అదే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావటం గమనార్హం. -
తిరుమలలో లడ్డూల కొరత
తిరుమల: తిరుమలలో శ్రీవారి భక్తులకు బుధవారం లడ్డూల కొరత ఎదురైంది. అదనపు లడ్డూలు అందలేదు. అవసరమైనన్ని లడ్డూలు నిల్వ లేకపోవడంతో కొరత ఏర్పడింది. అందువల్ల బుధవారం ఉదయం 11 గంటలకే అదనపు లడ్డూల కౌంటర్‌ను మూసివేశారు. అదనంగా లడ్డూలు తీసుకెళదామనుకున్న భక్తులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. తిరుమలలో ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్ ఉంది. ఇక్కడ రూ.25 ధరతో రూ.50కి రెండు, రూ.100కి నాలుగు లడ్డూలు చొప్పున టికెట్లు విక్రయిస్తారు. అయితే, ఈ కౌంటర్ నిర్వహించడంలో ఇక్కడి అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. అవసరమైనన్ని లడ్డూలు నిల్వ ఉంచుకోవడంలో విఫలమవుతున్నారు.