కర్నూలు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత | Kurnool road accident victims kin demands ex gratia | Sakshi
Sakshi News home page

కర్నూలు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత

May 12 2019 10:26 AM | Updated on Jul 11 2019 8:34 PM

Kurnool road accident victims kin demands ex gratia - Sakshi

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ...

సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగారు. అప్పటివరకూ మృతదేహాలను తరలించేది లేదని మృతులు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదుకుని, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరోవైపు ప్రమాదంలో దుర్మరణం చెందిన 16 మంది మృతదేహాలకు వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలను తెలంగాణ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి తరలించారు. కాగా మృతుల్లో 15మంది తెలంగాణ వాసులే. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కాగా, వారంతా సమీప బంధువులే కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement