'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది' | Konathala Ramakrishna takes on TDP President Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది'

Mar 20 2014 8:15 AM | Updated on Aug 14 2018 5:54 PM

'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది' - Sakshi

'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది'

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో ఎద్దేవా చేశారు. అందుకే బాబు అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అఖండ విజయం సాధిస్తుందని కొణతాల రామకృష్ణ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement