'కాపు నాయకుడిని సీఎం చేసుకుంటాం' | kapu caste leaders takes on chandrababu | Sakshi
Sakshi News home page

'కాపు నాయకుడిని సీఎం చేసుకుంటాం'

May 22 2015 7:52 PM | Updated on Jul 30 2018 6:21 PM

ఎన్నికలకు ముందు చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు.

కాకినాడ: ఎన్నికలకు ముందు చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారమిక్కడ జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై కాపు సంఘం నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

తమకు జరిగిన అన్యాయాన్ని 13 జిల్లాల్లో నడిరోడ్డుపై ఎండగడతామన్నారు. చరిత్రలో ద్రోహిగా నిలబడతావో, నాయకుడిగా మిగులుతావో తేల్చుకోవాలన్నారు.  తమకిచ్చిన హామీలు నెరవేర్చకుంటే తమ సామాజిక వర్గం నుంచి ఓ నేతను ముఖ్యమంత్రి  చేసుకుంటామని కాపు సంఘం నాయకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement