ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధం | Kanna Lakshminarayana Comments About Steel Factory In YSR District | Sakshi
Sakshi News home page

వైసీపీ ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే: కన్నా

Sep 14 2019 2:12 PM | Updated on Sep 14 2019 2:41 PM

Kanna Lakshminarayana Comments About Steel Factory In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని ఆరోపించారు. అందుకే అది కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైతే మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధి కోసం నాయకులతో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా రాకపోయినా రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement