'డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదు' | K Ramakrishna arrested by Anantapur police | Sakshi
Sakshi News home page

'డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదు'

Mar 11 2015 4:30 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ అంశంపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలో సీపీఐ నాయకులు, కార్యకర్తులు ఆందోళనకు దిగారు. దీంతో రామకృష్ణతోపాటు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ... అఖిలపక్షాన్ని స్వయంగా ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లాలని  సీఎం చంద్రబాబుకు సూచించారు. ఇదే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రుల ఇళ్ల ఎదుట కూడా నిరసనలు తెలుపుతామని రామకృష్ణ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement