జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ బోగస్ అని హైకోర్టే చెప్పిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
హైదరాబాద్ : జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ బోగస్ అని హైకోర్టే చెప్పిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం ఉదయం ఆయన ఓ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్పై ఆధారపడి బ్రతుకుతున్నామనే అపోహను సీమాంధ్ర ప్రజల్లో కల్పించవద్దని అన్నారు. కాంగ్రెస్ వైఖరి ప్రజల్లో ఆందోళన ఉందని... పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేవరకూ అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు.
తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అయితే కాంగ్రెస్ని ఎవరూ నమ్మరన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. విభజన ప్రకటన వెలువడిన తర్వాత పార్టీలు వైఖరి మార్చటం సరికాదన్నారు.