జెట్ కాయిల్స్‌తో అగ్నిప్రమాదం... ఆరిళ్లు దగ్ధం | jet coils lead to fire accident in ongole | Sakshi
Sakshi News home page

జెట్ కాయిల్స్‌తో అగ్నిప్రమాదం... ఆరిళ్లు దగ్ధం

Feb 2 2015 11:22 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని నేతాజీనగర్‌లో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు గాయపడగా, ఆరు గుడిసెలు దగ్ధం అయ్యాయి

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని నేతాజీనగర్‌లో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు గాయపడగా, ఆరు గుడిసెలు దగ్ధం అయ్యాయి. స్థానికంగా నివసించే కాశమ్మ ఇంట్లో దోమల నివారణకు జెట్ కాయిల్ వెలిగించారు. రాత్రి 10 గంటల సమయంలో జెట్ కాయిల్‌కు ఉన్న నిప్పు పక్కనే ఇంటి తడికెకు అంటుకోవడంతో అగ్నిప్రమాదానికి దారి తీసింది.మొత్తం ఆరు గుడిసెలు దగ్ధం అయ్యాయి.

ఈ ప్రమాదంలో కాశమ్మతో పాటు సైదులు, మీరయ్య గాయపడ్డారు. ఈ ప్రాంతంలో సుమారు 300 వరకు గుడిసెలు ఉన్నాయి. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది కార్మికులే. ప్రమాద సమయంలో గాలి వాటు లేకపోవడం, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు రూ. 4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement