175 స్థానాల్లో పోటీ చేస్తాం.. | janasena party twits on next elections | Sakshi
Sakshi News home page

175 స్థానాల్లో పోటీ చేస్తాం..

Oct 2 2017 12:05 PM | Updated on Mar 22 2019 5:33 PM

janasena party twits on next elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ జయంతి రోజున జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తారా.. లేదా అనే విషయంపై ఎట్టకేలకు అభిమానులకు ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో జనసేన పార్టీ తన అభ్యర్థులను పోటీకి దింపుతున్నట్టు ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో సోమవారం పోస్ట్‌ చేశారు.

‘మన బలం 175 ఉంటే 175 పోటీ చేద్దాం. మన బలం ఎంతుటే అంత, 175 స్థానాలకి తెలంగాణతో సహా అన్నింటికీ పోటీ చేస్తాం.. లేదా బలం లేదు మన బలం ఎంతో అంతే చేస్తాం’  అని ఆ పోస్ట్‌లో ఉంది. ఇటీవలే జనసేన పార్టీ స్థాపించి మూడు సంవత్సరాలైన విషయం తెలిసిందే. కాగా, ఓ వైపు జనసేన పార్టీ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతుంటే.. మరో వైపు ఆ ట్వీట్‌ను జనసేన పార్టీ కొద్దిసేపటికే తొలగించింది.

Advertisement
 
Advertisement
Advertisement