అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ | Interstate thieves arrested in vijayada | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

Jun 17 2015 6:16 PM | Updated on Aug 21 2018 7:58 PM

అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను విజయవాడ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

కృష్ణా : అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను విజయవాడ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాకు చెందిన బన్సీ, పవార్ మరికొందరితో కలసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడేవారని చెప్పారు. విజయవాడ నగరం చుట్టుపక్కల నాలుగు దోపిడీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దర్ని అరెస్ట్ చేసినట్టు కమిషనర్ తెలిపారు. వీరి నుంచి రూ.10.85లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement