అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్: రూ.23 లక్షల సొత్తు స్వాధీనం | interstate thieves arrested in chittoor district | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్: రూ.23 లక్షల సొత్తు స్వాధీనం

Apr 30 2016 11:06 AM | Updated on Aug 28 2018 7:30 PM

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం పట్టుకున్నారు.

చిత్తూరు : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం పట్టుకున్నారు. శనివారం చిత్తూరులో జిల్లా ఎస్పీ జి.శ్రీనివాసులు ... అనంతపురం జిల్లాకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా... చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతోందని చెప్పారు.

బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వలపన్ని వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, ఒక ఇన్నోవా కారుతోపాటు 600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement