బుధవారం ఉదయం తొమ్మిది గంటలను ంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం 33,639 మంది, ద్వితీయ సంవత్సరం 42,334 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్ : బుధవారం ఉదయం తొమ్మిది గంటలను ంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం 33,639 మంది, ద్వితీయ సంవత్సరం 42,334 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 107 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్లతోపాటు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్ అధికారులను నియమించారు. నాలుగు ఫ్లైయింగ్‌స్క్వాడ్ బృందాలు, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.
ప్రతి కేంద్రంలోనూ జంబ్లింగ్ విధానాన్ని అమ లు చేస్తున్నారు. అరగంట ముందే అంటే ఉదయం 8.30 గంటలకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 8.45గం’’లకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని, ఆ తర్వాతా వచ్చే వారిని ఆలస్యానికి కారణాలు అడిగి రికార్డు చేస్తామని, 9గం’’లకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోని అనుమతించే ప్రసక్తేలేదని ఆర్‌ఐఓ దామోదరాచారి తెలిపారు.