పసికందును వదిలివెళ్లారు.. | Infant found outside Temple | Sakshi
Sakshi News home page

పసికందును వదిలివెళ్లారు..

Sep 25 2015 2:40 PM | Updated on Sep 3 2017 9:58 AM

పసికందును వదిలివెళ్లారు..

పసికందును వదిలివెళ్లారు..

పది రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లారు. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

మహానంది (కర్నూలు) : పది రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లారు. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని నల్లమల అటవీప్రాంతం నంద్యాల-గిద్దలూరు రహదారిలోని వజ్రాలవంక సమీపంలోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద పది రోజుల మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు.

వజ్రాలు వెతుక్కునేందుకు అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు శిశువు ఏడుస్తుండగా విని వెళ్లి చూశారు. వారు గాజులపల్లె స్థానిక ఆర్‌ఎంపీ శర్మకు శిశువును అందజేయగా ఆయన ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement