వివాహితతో అసభ్య ప్రవర్తన | indecent conduct with married woman | Sakshi
Sakshi News home page

వివాహితతో అసభ్య ప్రవర్తన

Dec 15 2013 3:54 AM | Updated on Sep 2 2017 1:36 AM

మండలంలోని ధర్మారం(బి) గ్రామానికి చెందిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన అదే గ్రామానికి చెందిన గోరట్ల ప్రవీణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.

డిచ్‌పల్లి(ధర్పల్లి), న్యూస్‌లైన్ : మండలంలోని ధర్మారం(బి) గ్రామానికి చెందిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన అదే గ్రామానికి చెందిన గోరట్ల ప్రవీణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఎ స్సై వివరాల ప్రకారం..  మొరం వ్యాపారి వద్ద కొంతకా లం పనిచేసిన రామకృష్ణ అనే వ్యక్తి టిప్పరు కొనుగోలు కోసం డబ్బులకు గోరట్ల ప్రవీణ్ జమనాతు ఉన్నాడు.  రామకృష్ణ ఫైనాన్స్‌లో డబ్బులు కట్టక పోవడంతో వసూ లు కోసం ప్రవీణ్ శనివారం ఆయన ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఆయన లేకపోవటంతో అతడి భార్య జ్యోతితో దుర్భషలాడి చెయ్యి పట్టుకున్నాడు. విషయం తెలిసిన రామకృష్ణ తన అనుచరులతో కలిసి ప్రవీణ్ ఇంటికి వెళ్లి దాడిచేశారు. దాడిలో ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా అక్కడ ఇంటి ఎదుట ఉన్న మొరం టిప్పర్, లారీ అద్దాలను పగలగొట్టి, టైర్లలో గాలి తీసేశారు. తనపై రామకృష్ణ అకారణంగా దాడి చేసి గాయపరిచాడని ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement