రైతు ఆదాయాన్ని పెంచండి | Increase Farmers Income | Sakshi
Sakshi News home page

రైతు ఆదాయాన్ని పెంచండి

Apr 27 2018 2:25 PM | Updated on Oct 1 2018 2:47 PM

Increase Farmers Income - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న రామరాజు

విజయనగరం ఫోర్ట్‌ : రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషన్‌రేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రామరాజు, విశ్రాంత అడిషనల్‌ డైరెక్టర్‌ నారాయణ చౌదరి అన్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో వారు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.  వర్షాధార భూములు కాబట్టి చెరువులను అభివృద్ధి చేయించాలన్నారు. వ్యవసాయ శాఖ జేడీ జి.ఎస్‌.ఎన్‌.లీలావతి, డీడీ పి.అప్పలస్వామి పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement