హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత | High tension at hindupur govt hospital | Sakshi
Sakshi News home page

హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

Mar 21 2015 8:27 AM | Updated on Sep 28 2018 3:39 PM

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుతో పాటు తల్లి మృతి చెందింది.

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుతో పాటు తల్లి మృతి చెందింది. దాంతో బాలింత బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆమె బంధువులు ఆరోపించారు. తల్లి బిడ్డల మృతదేహాలతో వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి... మృతుల బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement