వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో చిరువ్యాపారి మృతి | Hacker dies accidentally at vaikuntam queue complex in tirumala | Sakshi
Sakshi News home page

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో చిరువ్యాపారి మృతి

Jun 14 2014 9:43 AM | Updated on Sep 2 2017 8:48 AM

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో శనివారం విషాదం చోటు చేసుకుంది.

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో శనివారం విషాదం చోటు చేసుకుంది. క్యూ కాంప్లెక్స్ నుంచి కిందపడి చిరువ్యాపారి గజేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో చిరువ్యాపారులు అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు వైకుంఠం కాంప్లెక్స్లో శనివారం అకస్మాత్తుగా  దాడులు నిర్వహించారు.

 

దాంతో క్యూకాంప్లెక్స్లో వ్యాపారం చేసుకుంటున్న చిరువ్యాపారులు భయపడి నలుదిశలా పరుగులు తీశారు. ఆ క్రమంలో గజేంద్ర వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కిటికి నుంచి బయటకు దూకాడు. దాంతో గజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిత్తూరు జిల్లా రామకుప్పంకు చెందినవాడని పోలీసులు తెలిపారు.  ఆఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement