వైఎస్ఆర్ సీపీలోకి మరో నేత | habibulla joined in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీలోకి మరో నేత

Aug 6 2017 9:21 PM | Updated on Aug 10 2018 9:42 PM

వైఎస్ఆర్ సీపీలోకి మరో నేత - Sakshi

వైఎస్ఆర్ సీపీలోకి మరో నేత

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలం పుంజుకుంటోంది. ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు హబీబుల్లా పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి హబిబుల్లాను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హబీబుల్లా మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌ రెడ్డి తరఫున ప్రచారం చేసి వైఎస్ఆర్ సీపీ గెలుపునకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.

పార్టీ నేతలు ఎంపీ మిథున్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో మరికొందరు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీలోకి చేరారు. 2014లో నంద్యాల అసెంబ్లీ నుంచి సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున హబిబుల్లా పోటీ చేశారు. ఆగస్టు మూడో తేదీన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. గతంలో కర్నూలు ఎంపీ బుట్టారేణుక ఆధ్వర్యంలో టీడీపీ, వామపక్షాలకు చెందిన దాదాపు 500 మంది వైఎస్ఆర్ సీపీ చేరిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement