ఎంపీ మేకపాటికి ఘనస్వాగతం | grand welcome to mekapati rajamohan reddy | Sakshi
Sakshi News home page

ఎంపీ మేకపాటికి ఘనస్వాగతం

Jun 22 2014 4:51 AM | Updated on Aug 9 2018 4:39 PM

ఎంపీ మేకపాటికి ఘనస్వాగతం - Sakshi

ఎంపీ మేకపాటికి ఘనస్వాగతం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నాయుడుపేటలో శనివారం ఘనస్వాగతం లభించింది.

 నాయుడుపేట టౌన్:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నాయుడుపేటలో శనివారం ఘనస్వాగతం లభించింది. పార్లమెంట్ సమావేశాల అనంతరం మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయనకు పార్టీ నాయకులు  స్థానిక గోమతి సెంటర్‌లో స్వాగతం పలికారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు సత్కరించారు.

రాజమోహన్‌రెడ్డి వెంట ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్‌ను కూడా అభినందించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాలేదని అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తారన్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, అవి పరిష్కారమయ్యేందుకు పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మండల పరిధిలోని ఎన్నికల ఫలితాలపై నాయకులతో కాసేపు చర్చించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓడూరు సుందరరామిరెడ్డి, కట్టా వెంకటరమణారెడ్డి, కామిరెడ్డి మోహన్‌రెడ్డి, పోతిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, నవీన్‌కుమార్‌నాయుడు, అన్నమనేని రామకృష్ణ, పాదర్తి హరనాథ్‌రెడ్డి, అత్తలపాళెం మధురెడ్డి, పేట చంద్రారెడ్డి, ముప్పాళ్ల జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గంధవల్లి సిద్ధయ్య, మైలారి నాగరాజు, జేష్టాది అంజనీ, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, ఆబోతుల బాబు, దుప్పల రవీంద్ర, షేక్ షబ్బీర్‌భాషా,జలదంకి రాజగోపాల్‌రెడ్డి,పట్టుకోట రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement