కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య | Gottimukkala Vice Sarpanch, ysrcp leader krishnarao murder | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య

Aug 11 2014 8:37 AM | Updated on Aug 10 2018 8:08 PM

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు.

గొట్టిముక్కల :  పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

 

దుండగులు కృష్ణారావు ఇంటిపై దాడి చేసి...అతన్ని నరికి చంపారు. కాగా టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement