ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు | Go to the displaced young man swimming | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు

Sep 9 2013 3:50 AM | Updated on Sep 4 2018 5:07 PM

మండలంలోని మూగచింతలపాలెం సమీపంలోని సాగర్ కుడికాలువలో ఆదివారం ఈతకు వె ళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. బొల్లాపల్లి గ్రామానికి చెందిన షేక్ సుభానీ(22) స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు.

 బొల్లాపల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని మూగచింతలపాలెం సమీపంలోని సాగర్ కుడికాలువలో ఆదివారం ఈతకు వె ళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. బొల్లాపల్లి గ్రామానికి చెందిన షేక్ సుభానీ(22) స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు షేక్ ఖాశింసాహెబ్, ఖాసింబీ, కుటుంబసభ్యులు, బంధువులు కాలువ వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఎ.సురేంద్రబాబు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
 మృతుడి తల్లి ఖాసింబీ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందారు. మరణవార్త తెలుసుకున్న గ్రామస్తులు, స్నేహితులు కాలువ వద్దకు చేరుకున్నారు. మృతుడు వైజాగ్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎన్నికల సమయంలో ఇంటికి వచ్చి గ్రామంలో ఉంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుభానీ మృతదేహం కోసం గ్రామస్తులు, బంధువులు గాలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement