లాకప్ గదికి కన్నం పెట్టి నలుగురు దొంగల పరారీ | Four Thieves escape from police lock up in Narasapuram | Sakshi
Sakshi News home page

లాకప్ గదికి కన్నం పెట్టి నలుగురు దొంగల పరారీ

Oct 23 2013 10:23 AM | Updated on Aug 28 2018 7:30 PM

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు నిందితులు పరారయ్యారు.

నర్సాపురం : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు తెల్లవారుజామున నలుగురు నిందితులు పరారయ్యారు. వీరు నలుగురు ...పోలీసుల కళ్లుగప్పి పోలీస్ స్టేషన్లోని లాకప్ గదికి కన్నం పెట్టి తప్పించుకున్నారు. ఓ కారు దొంగతనం కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. నిందితులు కృష్ణాజిల్లా, హైదరాబాద్ కు చెందినవారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement