పాలవ్యాన్ను ఢీకొన్న కారు, నలుగురు మృతి | Four killed, 1 injured in road accident | Sakshi
Sakshi News home page

పాలవ్యాన్ను ఢీకొన్న కారు, నలుగురు మృతి

Dec 4 2013 1:09 PM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.

మెదక్ : మెదక్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి పాల వ్యాన్ ఢీకొన్న సంఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా కరీంనగర్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా  ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement