తెనాలిలో నలుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్ | Four gamblers arrested in Guntur district | Sakshi
Sakshi News home page

తెనాలిలో నలుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్

Jan 31 2016 9:32 AM | Updated on Aug 20 2018 4:44 PM

గుంటూరు జిల్లా తెనాలి బీసీ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు.

గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలి బీసీ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 44 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే జిల్లాలోని అమృతలూరు మండలం పెదపూడిలో ముగ్గురు కోడిపందాల నిర్వహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement