డెంగ్యూతో ఐదేళ్ల చిన్నారి మృతి | Five year old boy dies of Dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో ఐదేళ్ల చిన్నారి మృతి

Aug 2 2015 11:48 AM | Updated on Apr 4 2019 5:20 PM

డెంగ్యూ వ్యాధితో ఐదేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మనేవారిపల్లిలో చోటుచేసుకుంది.

చిత్తూరు (రామసముద్రం) : డెంగ్యూ వ్యాధితో  ఐదేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మనేవారిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మనేవారిపల్లి గ్రామానికి చెందిన శివమణి(5) అనే బాలుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.

తల్లిదండ్రులు బాలుడికి రామసముద్రం, మదనపల్లిలోని ఆసుపత్రుల్లో వైద్యం చేయించగా అక్కడి వైద్యులు తిరుపతికి తీసుకెళ్లమని సూచించారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడికి డెంగ్యూ సోకిందని తిరుపతి వైద్యులు తేల్చారు. తిరుపతిలో చికిత్సపొందుతూ శనివారం అర్ధరాత్రి బాలుడు మృతిచెందాడు. దీంతో బాలుడి ఇంట్లో విషాదం అలుముకుంది.

Advertisement
 
Advertisement
Advertisement